రాజ్యాంగంపై విద్యార్ధులకు నియోజకవర్గ స్ధాయి పోటీలు
ASR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నియోజకవర్గ స్ధాయి వక్తృత్వం పోటీలను సోమవారం నిర్వహించారు. ఈ పోటీలు అరకులోయ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగాయని హెచ్ఎం మోహనరావు తెలిపారు. ఈ పోటీలలో అరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 18 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. పోటీలు అరకులోయ ఎంఈవో-1 వీ.త్రినాధరావు ఆధ్వర్యంలో జరిగాయి.