మరో వివాదంలో పూజా ఖేడ్కర్‌

మరో వివాదంలో పూజా ఖేడ్కర్‌

ఇటీవల ట్రైనీ ఐఏఎస్ ఉద్యోగం కోల్పోయిన పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నవీ ముంబైలోని ఓ సిగ్నల్ వద్ద కారును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటన తర్వాత ట్రక్కు డ్రైవర్ కనిపించకుండా పోయాడు. అయితే ప్రమాదం తర్వాత ఆ డ్రైవర్ను ఇద్దరు వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకుని వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా ఆరా తీయగా.. పూజ నివాసంలో డ్రైవర్ ఆచూకీ లభ్యమవ్వడం వివాదానికి దారి తీసింది.