ANUలో ఫైన్ ఆర్ట్స్ అవకాశాలపై అవగాహన

ANUలో ఫైన్ ఆర్ట్స్ అవకాశాలపై అవగాహన

GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్ విద్య, ఉపాధి అవకాశాలపై గురువారం అవగాహన కార్యక్రమం జరిగింది. నిఫ్ట్-కేరళ ఆల్ ఇండియా ర్యాంకర్ పి. వైష్ణవి, శాంతినికేతన్ విశ్వభారతి యూనివర్సిటీ విద్యార్థి బి. పవన్‌ కుమార్‌ విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. వీరిని వీసీ గంగాధరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ దేవకాంత్‌, అధ్యాపకుడు జాన్ రత్నబాబు పాల్గొన్నారు.