VIDEO: వీధి కుక్కల స్వైర విహారం
ప్రకాశం: మార్కాపురంలో వీధి కుక్కల సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా పూలసుబ్బయ్య కాలనీ తర్లుపాడు రోడ్డు ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రధాన రహదారులపై గుంపులుగా సంచరిస్తుండడంతో ప్రజలు అటువైపుగా వెళ్లడానికి భయపడుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కల స్వైర్య విహారానికి చెక్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.