దుకాణాల్లో పండగ ఆఫర్లు
VZM: క్రిస్మస్, సంక్రాంతి పండుగల సందర్భంగా APCO ప్రత్యేక ఆఫర్లు ప్రకటించిందని విజయనగరం మండల వాణిజ్య అధికారి ఆర్వీ మురళీ కృష్ణ తెలిపారు. హ్యాండ్లూమ్ ఉత్పత్తులపై సాధారణ 40% తగ్గింపుతో పాటు అదనపు రాయితీలు ఉంటాయని చెప్పారు. గంటస్తంభం, ఎంజీ రోడ్డు, పూల్‌భాగ్, చీపురుపల్లి విక్రయశాలల్లో ఆఫర్లు లభిస్తాయని, చేనేతను ప్రోత్సహించాలన్నారు.