VIDEO: బాపులపాడులో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా: బాపులపాడు(M)లో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వీరవల్లి పంచాయతీ కార్యాలయం సమీపంలో తిరుపతమ్మ తల్లి గుడి నుంచి వస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో మూడేళ్ల చిన్నారి రియాల్షి అక్కడికక్కడే మృతి చెందింది. లారీ టైరు చిన్నారిపై నుంచి వెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మేనమామ సునీల్‌కు గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.