రైతులకు మంత్రి సూచన

SKLM: రబీ సీజన్ కోసం ఇప్పుడే యూరియాను కొనుగోళ్లు చేయొద్దని శ్రీకాకుళం ఎమ్మెల్యే, మంత్రి అచ్చెన్నాయుడు రైతులను కోరారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను దారి మళ్లించవద్దని ఆదివారం చెప్పారు. వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. యూరియా పంపిణీలో చాలాచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.