'బెట్టింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు'
SKLM: సరుబుజ్జిలి మండలంలో క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై బి. హైమావతి గురువారం హెచ్చరించారు. ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని యువతకు సూచించారు. బెట్టింగ్ వంటి వ్యసనాలకు బానిసలై బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, సమాజంలో గౌరవాన్ని కోల్పోవద్దని ఆమె హితవు పలికారు.