రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
MBNR: సీసీకుంట మండలం నెల్లికొండి-పెద్ద వడ్డెమాన్ వెళ్లే రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ఎదురుగా నెల్లికొండి వైపు నుంచి వస్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అప్పంపల్లి గ్రామానికి చెందిన లచ్చన్న (35) మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.