VIDEO: గుంతలమయంగా మారిన రోడ్డు

NZB: వర్ని మండలం తగిలేపల్లి రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఓవర్ లోడ్ ఇసుక ట్రాక్టర్లు, లారీలు తిరగడం వల్ల రోడ్డు ఈ దుస్థితికి చేరిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు చేరి ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.