'గిరిజనుల మౌలిక సమస్యలు పరిష్కరించాలి'

'గిరిజనుల మౌలిక సమస్యలు పరిష్కరించాలి'

TPT: కాంబాకం పంచాయతీలోని రామిరెడ్డి పాలెం గిరిజన కాలనీ ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఆంబాకం చిన్నిరాజ్ డిమాండ్ చేశారు. అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.