అద్వానంగా రోడ్డు.. విద్యార్థుల కష్టాలు

అద్వానంగా రోడ్డు.. విద్యార్థుల కష్టాలు

NLG: మునుగోడు మండలం తోరటికల్లు–చండూరు మండలం తస్కాని గూడెం మధ్య రహదారి దయనీయస్థితిలో ఉంది. బడికి వెళ్లేందుకు విద్యార్థులు ప్రతిరోజూ కష్టాలు పడుతున్నారు. ప్రాథమిక సదుపాయాల కోసం గ్రామస్థులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా, అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.