బనగానపల్లెలో 21న APMS ప్రవేశ పరీక్ష

NDL: బనగానపల్లె పరిధిలోని ఏపీ మోడల్ స్కూల్‌లో 2025-26న విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షను ఈ నెల 21న నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రామలక్ష్మి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. 21వ తేదీ ఉదయం 8:30 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు.