టేకుమట్లలో గంజాయి అక్రమ రవాణా: ఇద్దరి అరెస్ట్

టేకుమట్లలో గంజాయి అక్రమ రవాణా: ఇద్దరి అరెస్ట్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో గురువారం అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు అని ఎస్సై సుధాకర్ తెలిపారు. వారి వద్ద నుంచి 1.2 కిలోల గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎస్సై పేర్కొన్నారు.