చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు

చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులు

PLD: 0-6 సంవత్సరాల చిన్నారులు, 6-15 సంవత్సరాల ఆధార్ కార్డు లేని విద్యార్థులకు ఫిరంగిపురం మండలంలో ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఈనెల 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు గొల్లపాలెం పంచాయతీ కార్యాలయం, పొనుగుపాడు సచివాలయం, 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమీనాబాద్-2 సచివాలయంలో క్యాంపులు జరుగుతాయన్నారు.