హెల్మెట్ ధరించనందుకు రూ.21 లక్షల ఫైన్!
ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తికి విధించిన చలాన్ నెట్టింట వైరల్ అవుతోంది. హెల్మెట్ ధరించనందుకు వచ్చిన రూ.20,74,000 చలాన్ చూసి స్కూటర్ యజమాని సింఘాల్ షాక్ అయ్యాడు. అనంతరం ఆ చలాన్ నెట్టింట పోస్ట్ చేయగా.. తప్పు తెలుసుకున్న పోలీస్ అధికారి ఆ చలాన్‌ను సరిచేశాడు. ఈ కేసు మోటరు వాహనాల చట్టంలోని సెక్షన్ 207కు వర్తిస్తుంది. దీంతో రెండు కలిసిపోయి అంత చలాన్ వచ్చిందని చెప్పాడు.