ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధురాలు మృతి
MDCL: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన ఉప్పల్లో ఈసీఐఎల్ బస్టాప్ వద్ద ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో శుభోదయం కాలనీకి చెందిన చిట్యాల లక్ష్మీ (64) మృతి చెందారు. బస్సు ఎక్కే సమయంలో డ్రైవర్ వాహనాన్ని కదిలించడంతో అనుకోకుండా కిందపడి తీవ్రంగా గాయపడగా, గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.