ఆవు కడుపులో 100 కేజీల ప్లాస్టిక్
నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో పుల్లయ్యకు చెందిన ఆవు అస్వస్థతకు గురైంది. కడుపు ఉబ్బి మూర్ఛపోవడంతో పశుసంవర్ధక శాఖ ఏడీ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్‌లో ఆవు కడుపు నుంచి సుమారు 100 కేజీల ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సమయానికి చికిత్సతో ఆవు ప్రాణాలు కాపాడడంతో ఈ ఘటన చర్చనీయాంశమైంది.