వరంగల్ నగరంలో భారీ వర్షం.. అప్రమత్తమైన అధికారులు

WGL: వరంగల్ నగరంలో గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో భారీ వర్షంతో అండర్ రైల్వే బ్రిడ్జి, హంటర్ రోడ్, ఉర్సు గట్ట, బట్టల బజార్, రహదారులు జలమయం అయ్యాయి. వరదలో వాహనాలు చిక్కుకున్నాయి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నీటమునిగాయి. నేడు కురుస్తున్న వర్షాలకు భయాందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.