యుద్ధం. స్వరాష్ట్రానికి 500 మంది ఏపీవాసులు
AP: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో 500 మందికిపైగా ఏపీ వాసులు స్వరాష్ట్రానికి వచ్చినట్లు ఏపీ ప్రవాస తెలుగు సంఘం స్పష్టం చేసింది. వీరిలో ఎక్కువ మంది తాత్కాలిక వీసాలపై గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారే ఉన్నారని చెప్పింది. అలాగే మిగిలిన వారిని కూడా తీసుకురానున్నట్లు తెలిపింది.