ఇండిగోకు రూ.59 కోట్ల జరిమానా!

ఇండిగోకు రూ.59 కోట్ల జరిమానా!

ఇండిగోకు వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తాజాగా 2020-21 ఆర్థిక సంవత్సరంలోని జీఎస్టీకి సంబంధించి ఇండిగోకు దాదాపు రూ.59 కోట్ల జరిమానాను సీజీఎస్టీ అడిషనల్ కమిషనర్ విధించారు. దీనిపై ఇండిగో స్పందించింది. అధికారుల తప్పిదంతో ఈ ఆదేశాలు జారీ అయినట్లు భావిస్తున్నట్లు చెప్పింది. దీనిపై సంబంధిత విభాగంలో సవాల్ చేయనున్నట్లు వెల్లడించింది.