‘మెనూ ప్రకారం భోజనం అందజేయాలి’

‘మెనూ ప్రకారం భోజనం అందజేయాలి’

SKLM: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మెనూ ప్రకారం మాత్రమే తప్పనిసరిగా అమలు చేయాలని ఎంఈవో బమ్మిడి మాధవరావు తెలిపారు. శనివారం జలుమూరు మండలంలోని పలు పాఠశాలలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. వాతావరణంలో వస్తున్న మార్పులు కారణంగా వేడిగా, శుద్ధిగా విద్యార్థులకు భోజనం అందించాలన్నారు.