ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
JGL: జగిత్యాల అర్బన్ మండలం మోతే గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. అనంతరం సిర్ర నర్మదా-మోహన్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.