VIDEO: అయోధ్య శ్రీ రామ రథానికి స్వాగతం
JGL: మల్లాపూర్ మండలం వేంపల్లిలో శ్రీరామనవమి పర్వదినాన అయోధ్య నుంచి వచ్చిన 'శ్రీరామ రథం ' ఆధ్యాత్మిక శోభను నింపింది. గ్రామస్తులు, హనుమాన్ స్వాములు మంగళహారతులతో రథానికి ఘన స్వాగతం పలికారు. పూజారులు సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రథాన్ని గ్రామంలో వైభవంగా ఊరేగించారు. సాక్షాత్తు అయోధ్య రాముడే తమ ఊరికి వచ్చాడని భక్తులు పరవశించిపోయారు.