గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

VZM: అలమండ రైల్వే స్టేషన్ పట్టాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు GRP ఎస్సై బాలాజీరావు శనివారం తెలిపారు. మృతుని వయస్సు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. మెరున్, సిమెంట్, తెలుపు, రంగులు కలిగి ఉన్న టీ షర్ట్, హాఫ్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. ఆచూకీ తెలిసినవారు విజయనగరం GRP చరవాణి నెంబర్ 9490617089, 830 990038 లకు సంప్రదించాలని కోరారు.