ఖమ్మం నగరాన్ని ఆదర్శంగా నిలిచేలా చర్యలు: తుమ్మల
KMM: శాంతియుత వాతావరణంతో పరిశుభ్రమైన నగరంగా ఖమ్మం ఆదర్శంగా నిలిచేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం ఖమ్మం ఆర్టీవో కార్యాలయం వద్ద రూ.కోటి 46 లక్షలతో రోడ్డు విస్తరణ, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు, విజయనగర కాలనీలో రూ.50.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.