భారీగా పెరిగిన టమాటా ధర.. ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం కిలో రూ.20 నుంచి రూ.30 పలికిన టమాటా ధర భారీగా పెరిగింది. 15 రోజుల్లో డబుల్ ధర అయింది. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. రిటైల్ మార్కెట్‌లో రూ.100కు చేరువలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు టమాటా పంటలు దెబ్బతిన్నాయని, దీంతో ధరలు అమాంతం పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.