మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు: తహసీల్దార్
బాపట్ల: రేపల్లె మండలం నిజాంపట్నం గ్రామ శివారు గోకర్ణ మఠంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో, వారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తహసీల్దార్ మోర్ల శ్రీనివాసరావు, దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సమీక్షలో నిజాంపట్నం ఎస్సై కందుల తిరుపతిరావు పాల్గొన్నారు.