పరదేశిపాలెం రహదారిపై నదీ ప్రవాహం

VSP: భీమిలి నియోజకవర్గంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో పరదేశిపాలెం, పాత పరదేశి పాలెం, కాపులఉప్పాడ, కొండపేట గ్రామాలకు వెళ్లే ఏకైక రహదారిపై వర్షం నీరుప్రవహిస్తుంది. రహదారిలో ఉన్న వంతెనపై నుండి వర్షం నీరు ప్రవహించటంతో నడక దారిలో వెళ్లే ప్రజలు గెడ్డకు అవతలనే ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు ప్రమాదపు టంచున ప్రయాణిస్తున్నారు.