ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి.. భారతీయుడికి గాయాలు

ఎయిర్‌పోర్టుపై డ్రోన్ దాడి.. భారతీయుడికి గాయాలు

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ మరోసారి డ్రోన్ల దాడికి తెగబడింది. ఈ మెరుపు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఓ భారతీయుడు ఉన్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ దాడి కలకలం రేపింది. అయితే విమానాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగలేదని, యథావిధిగా సేవలు అందుతున్నాయని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా నిఘా పెంచారు.