'ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు జరగాలి'
SKLM: రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఆదేశించారు. బుధవారం ఆయన శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగిలోని సీతారామ మోడరన్ రైస్ మిల్లుతో పాటు వాకలవలసలోని లలిత ట్రేడర్స్ ధాన్యం మిల్లులను తనిఖీలు చేశారు. ఐయా మిల్లు వద్ద నిల్వ ఉన్న ధాన్యం బస్తాల స్టాక్ రిజిస్టర్‌లను పరిశీలించారు.