విజ్ఞాన భాండాగారంగా IITH గ్రంథాలయం
HYD: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IITH) గ్రంథాలయం విజ్ఞాన భాండాగారంగా నిలుస్తోంది. ఇక్కడ 50 వేలకు పైగా ముద్రిత పుస్తకాలు, 3.5 లక్షలకు పైగా ఈ-బుక్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక నిర్మాణంతో సూర్యకిరణాలు సహజంగా లోపలికి వచ్చేలా ఇంజినీర్లు రూపకల్పన చేశారు. 36 దేశాలకు చెందిన భాషల్లో చిన్న పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి.