పాఠశాలకు క్రీడా పరికరాలు విరాళం

NDL: సంజామల మండల పరిధిలోని కానాలకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి దూదేకుల మహబూబ్ షరీఫ్ స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలకు రూ. 6000 విలువగల క్రీడా పరికరాలను అందజేసి దాతృత్వం చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను HM మురళీకృష్ణ శాస్త్రి ఉపాధ్యాయులతో కలిసి ఘనంగా సన్మానించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఈ మేరకు HM, షరీఫ్ ఆకాంక్షించారు.