రేపు పశు వైద్యశిబిరం

రేపు పశు వైద్యశిబిరం

ASR: అరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆర్థిక సహకారంతో అరకులోయ మండలంలోని పెదలబుడు పంచాయతీ పరిధి గంజాయిగుడ గ్రామంలో శుక్రవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు చైర్‌పర్సన్ బొరిబొరి లక్ష్మి తెలిపారు. ఉదయం 7 గంటలకు పశు సంవర్థకశాఖ ఏడీ, పశువైద్యాధికారులు, సిబ్బంది పశువులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.