సంప్రదాయ దుస్తుల్లో పోలీసులు

సంప్రదాయ దుస్తుల్లో పోలీసులు

KDP: ఉగాది పండుగ సందర్భంగా ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో హాజరైన పోలీసులు ఏఎస్పీ విభూకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు భయపడకుండా తమ సమస్యలను స్వేచ్ఛగా తెలియజేయాలని ఏఎస్పీ సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి స్వీట్లు, ఉగాది పచ్చడి ఆరగించి పండుగను ఆనందంగా జరుపుకున్నారు.