ఉపాధి పనులు పరిశీలించిన MPDO
ATP: బొమ్మనహల్ మండలంలోని సిద్ధారంపురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, కాలువల తవ్వకం, శుభ్రపరిచే పనులను ఎంపీడీవో విజయభాస్కర్ పరిశీలించారు. పనుల్లో నాణ్యతపై రాజీపడకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. కూలీల ఆధార్ ఈకేవైసీ పెండింగ్స్‌ను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో,ఈసీ,టెక్నికల్ అసిస్టెంట్లు, ఉపాధి కూలీలు పాల్గొన్నారు.