పుట్టపర్తిలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

పుట్టపర్తిలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

సత్యసాయి: పుట్టపర్తితో పాటు అన్ని మండల డివిజన్ కార్యాలయాల్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తామని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు తమ దరఖాస్తులను meekosam.ap.gov.inలో ఆన్‌లైన్‌లో కూడా సమర్పించవచ్చని లేదా పరిష్కార సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని ఆయన సూచించారు.