రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన గ్రామస్తులు
BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజపేట గ్రామస్తులు ఇవాళ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. వందలకు కొద్ది లారీలు మా గ్రామం మీదగా వెళ్తూ వాటి వల్ల దుమ్ము ధూళితో అనారోగ్య పాలవుతున్న అధికారులు పట్టించు కోవడం లేదని తెలిపారు. ఇసుక లారీల వల్ల ట్రాఫిక్ జామ్ కావడంతో కార్మికులు విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.