'పేదలకు అండ సీపీఐ జెండా'

దేవరకొండ: వందేళ్ల సీపీఐ చరిత్రలో పేద మధ్య తరగతి ప్రజల అభ్యున్నతి కోసం అనేక ఉద్యమాలు నిర్వహించామని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని అన్నారు. మంగళవారం పట్టణంలో జరిగిన సీపీఐ నల్గొండ జిల్లా 23 వ మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ మహాసభల్లో పల్లా, శ్రీనివాస్ రెడ్డి, నరసింహ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ సత్యం,తదితరులు పాల్గొన్నారు.