మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని వ్యక్తి మృతి

TG: మహబూబాబాద్‌ జిల్లా పిల్లిగుండ్ల తండాలో బానోత్‌ బిచ్చా(54) అనే వ్యక్తి గొంతులో మాంసం ముక్క ఇరుక్కొని మృతిచెందాడు. తండాలో దుర్గమ్మ వేడుకలు జరిగాయి. బిచ్చా ఇంట్లోనూ పూజలు చేశారు. అనంతరం మాంసాహారంతో భోజనం చేస్తుండగా బిచ్చా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుపోయి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.