రైలు కింద పడి గుర్తు తెలియని మహిళ మృతి
కడప శివారులోని కనుమలోపల్లె-భాకరాపేట మార్గ మధ్యలో బుధవారం రైలు కింద పడి గుర్తు తెలియని 45 ఏళ్ల మహిళ మృతి చెందినట్లు కడప రైల్వే పోలీసులు తెలిపారు. ఆమె కుడి చేతిపై 'రాములు' అనే పేరుతో పచ్చబొట్టు ఉందని, నీలం రంగు చీర ధరించి ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.