జాగ్రత్త.. కుక్క కాటును లైట్ తీసుకోవద్దు!
యూపీలోని మీర్జాపూర్(D)లో కుక్క కరిచిన నాలుగు నెలల తర్వాత ఓ బాలుడు దానిలాగే అరవడం కలకలం రేపింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రేబిస్ వ్యాక్సిన్ కోర్సు పూర్తి చేయకుండా, రెండు డోసులు మాత్రమే వేయించడంతో ఇన్‌ఫెక్షన్ ముదిరిపోయింది. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, అతను బతికే అవకాశాలు తక్కువని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన రేబిస్ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది.