స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పాత్ర మరవలేనిది

స్వాతంత్య్ర ఉద్యమంలో అల్లూరి పాత్ర మరవలేనిది

ASR: స్వాతంత్య్రం సమరయోధులు అనగానే గిరిజన ప్రజలకు గుర్తొచ్చే పేరు అల్లూరి సీతారామరాజు. పాండ్రంగిలో జన్మించిన అల్లూరి మన్యంలో బ్రిటిష్ ఆగడాలకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలకు అండగా పోరాటం చేశారు. వారిలో చైతన్యం రగిల్చి బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన యోధుడుగా చరిత్రలో నిలిచిపోయారు. ప్రాణ త్యాగం చేసిన మన్యం వీరుడుగా ఆయన గిరిజనుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.