చలికాలంలో బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు

చలికాలంలో బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు

చలికాలంలో బెల్లం తింటే శరీరం వెచ్చగా ఉంటుంది. దీనికి వేడి చేసే గుణం ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. బెల్లంలో సంక్లిష్టమైన పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి నెమ్మదిగా జీర్ణం అవుతాయి. శరీరానికి నిరంతరం శక్తిని అందిస్తాయి. యాక్టివ్‌గా ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. నీరసం, అలసట తగ్గుతాయి. బద్ధకం పోతుంది. చలికాలంలో సహజంగా ఉండే బద్ధకం నుంచి బయటపడొచ్చు.