'మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకువెళ్లాలి'

'మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకువెళ్లాలి'

SRCL: ప్రజలు ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల రేషన్ ఒకేసారి తీసుకువెళ్లాలని జిల్లా పౌరసరాఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు అన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేస్తారని వివరించారు. జిల్లాలోని 1,95,554 ఆహార భద్రత కార్డులకు 3 మాసాలకు గాను 1,11,721.65 క్వింటాల పీడీఎస్ సన్న బియ్యం కేటాయింపులకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.