'గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'

'గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం'

WGL: గ్రామాల్లో రోడ్డు రవాణా మెరుగుపరచి ప్రజలకు సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. నల్లబెల్లి మండలం నందిగామ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామ సమస్యలను పరిష్కరించి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.