అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి

అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి

KNR: అనుమానస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి చెందిన సంఘటన సైదాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శివరాంపల్లికి చెందిన రెడ్డి లావణ్య రాజు దంపతుల కుమార్తె అర్చన (17) శుక్రవారం కాలేజీకి వెళ్లి పరీక్ష రాసి వచ్చిందని, రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడిపిందన్నారు. తెల్లవారేసరికి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.