మార్కెట్ యార్డులో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం

కృష్ణా: గన్నవరం మార్కెట్ యార్డులో పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గూడవల్లి నరసింహారావు ఆధ్వర్యంలో డైరెక్టర్లు పాల్గొన్నారు. మార్కెట్ ప్రాంగణంలో పరిశుభ్రత, పచ్చదనం పెంపు చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. సిబ్బంది అందరూ చురుకుగా పాల్గొని మార్కెట్ యార్డు అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.