సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

SRCL: ముస్తాబాద్ మండలం గూడూరులో సర్పంచ్ చీటి సునీత ఆద్వర్యంలో సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు ఎదునూరి అంజవ్వకు రూ.15 వేలు, షేక్ మొహమ్మద్‌కు రూ.7500, మరో షేక్ మొహమ్మద్‌కు రూ.8 వేల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని సర్పంచ్ తెలిపారు. వీరితో పాటు వార్డు సభ్యులు శ్రీనివాస్, పాల్గొన్నారు.