రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

MHBD: పెద్దవంగర మండలంలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన ముసుకు సోమయ్య (60) వ్యవసాయ పనుల నిమిత్తం తన TVS XL ద్విచక్ర వాహనంపై పత్తి బస్తాలతో ఇంటికి వెళ్తున్నాడు. ఉప్పరగూడెం మీదుగా పెద్దవంగర వైపు వెళుతున్న కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో సోమయ్యకు తీవ్ర గాయాలు కాగా, కుటుంబ సభ్యులు తొర్రూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.